వేసవిలో త్రాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు
కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా చీకటి ప్రదేశం లేకుండా చర్యలు తీసుకోవాలి
ఎల్.ఆర్.ఎస్ 25% రాయితీ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్ , ఏప్రిల్-09, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
కార్పోరేషన్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతి పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా చీకటి ప్రదేశం ఉండకుండా చర్యలు తీసుకొని ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని, రోడ్లపై ఎక్కడ చెత్తాచెదారం ప్లాస్టిక్ ఉండకుండా రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు.ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ కింద 25 శాతం ఫీజు రాయితీ గడువు ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని, దీనిని సంబంధిత ప్రజలు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని, ఎల్.ఆర్.ఎస్ క్రింద ఆమోదం పొందిన దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ ఏప్రిల్ 30 లోపు రుసుము చెల్లించి 25 శాతం రాతి పొందేలా చూడాలని అన్నారు.ఈ సమావేశంలో ఈఈ మున్సిపల్ కార్పొరేషన్ రామన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.