జనం న్యూస్ ఏప్రిల్ 9 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా
బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన డా. తంగలపల్లి సంతోష్ గౌడ్ శనివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ,ను చండిఘర్, రాజ్ భవన్ లో కలవడం జరిగింది. హర్యానా గవర్నర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ప్రజల యోగ క్షేమాలతో పాటు, తన పరిశోధన విషయాలను అడిగి తెలుసుకున్నారన్నారు. కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్ ప్రాంత గత తన పర్యటనల స్మృతులను గుర్తూ చేసుకున్నారు. అనంతరం రాజ్భావన్ లో ఆయన డా. సంతోష్ గౌడ్ ను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.