జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 08-04-2025
అభినందనలు తెలిపిన డిపో మేనేజర్ తేది 08/04/2025(మంగళవారం )రోజున ఆర్టీసి వరంగల్ రిజియన్ యందు ఆర్మ్ విజయ బాను ఆధ్వర్యంలో ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా నర్సంపేట డిపో ఉద్యోగి డ్రైవర్ హరిసింగ్ బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకుని డిపో ఆధాయానికి కృషి చేసినందుకు వరంగల్ రిజియన్ అధికారుల సమక్షంలో అవార్డు అందజేశారు. ఎక్కువ ఇన్సెంటివ్ తీసుకుని డిపో ఆదాయం పెంచడం మరియు రిజియన్ అధికారుల నుండి అవార్డు తీసుకున్న డ్రైవర్ హరిసింగ్ ని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ ఆర్మ్(ఓ & యం)భాను కిరణ్ , మహేష్ కుమార్ , పీ ఓ సైదులు మరియు డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ , యమ్ ఎఫ్ ప్రభాకర్, ఎస్ డి ఐ వెంకటేశ్వర్లు, బండి బాబు మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.