పయనించే సూర్యుడు జనవరి 16 ప్రతినిధి భూక్యా కవిత. జగ్గయ్యపేట పట్టణంలో పాత పేట గడ్డ వద్ద ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్, శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, షరాబు వర్తక సంఘం అధ్యక్షులు శ్రీరాం రామక్రిష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా , తుమ్మేపల్లి నరేంద్ర మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, భరతనాట్యం, గంగిరెద్దుల నృత్యాలతో ప్రజలు సంతోషంగా అనంతరం స్టేజ్ పై ప్రదర్శించిన వారికి పెద్దలు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు మరియు నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు