విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా పోలీసు ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 8న నిర్వహించగా, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆర్ధిక అవసరాలను తీర్చుకొనేందుకుగాను జిల్లా పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయబడిందన్నారు. తక్కువ వడ్డీతో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలను పొందే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, ఇంటి రిపేర్లు, అత్యవసర వైద్య ఖర్చులు మరియు ఇతర ఆర్ధిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారన్నారు. ఈ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 2024 - 25 సంవత్సరంకు వచ్చిన ఆదాయ, వ్యయాలను, పోలీసు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సొసైటీ సభ్యులకు జిల్లా ఎస్పీ వివరించారు. పోలీసు ఉద్యోగులు తీసుకున్న సభ్యత్వం, సర్వీసు ఆధారంగా ఇప్పటికే
రూ.3లక్షల నుండి రూ.5 లక్షలను వ్యక్తిగత రుణాలుగా అందజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుండి సలహాలను, సూచనలను స్వీకరించినట్లుగా, ప్రతీ మాసం సొసైటీ సెక్రటరీ, డైరెక్టర్లుతో సమావేశం నిర్వహించి, ముఖ్యమైన విషయాలను చర్చించి, నిర్ణయాలు చేపడతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. పోలీసు సంక్షేమంలో భాగంగా కో-ఆపరేటివ్ సభ్యత్వం కలిగిన ఉద్యోగుల పిల్లలు 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 90శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన 40మంది విద్యార్థులకు రూ.1,87,500/-ల నగదును స్కాలర్షిప్స్ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అందజేసారు. అనంతరం, పోలీసు ఉద్యోగుల పిల్లలతో జిల్లా ఎస్పీ మమేకమై, మంచి లక్ష్యాలను నిర్ధేశించుకొని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో వారు సాధించిన మార్కులు, ప్రస్తుతం వారు ఎక్కడ చదువుతున్నది వంటి విషయాలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని, వారికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చి, విద్యార్థుల్లో స్పూర్తి నింపారు. ఈ సర్వసభ్య సమావేశంలో అదనవు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎన్బీ సిఐ ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, ఇతర పోలీసు అధికారులు, కో-ఆపరేటివ్ సెక్రటరీ ఎం. నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు ఎస్.రామకృష్ణ, పి.ఈశ్వరరావు, ఎం.విజయ చందర్, వై.చిన్నారావు మరియు కో-ఆపరేటివ్ సభ్యులు, పోలీసు అసోసియేషను అడహక్ అధ్యక్షులు కే.శ్రీనివాసరావు పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు