జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ.
పేదలపై పన్నులు పెంచుతు సంపన్నులకు రాయితీలు ఇస్తు నరేంద్ర మోడీ నయా వంచన పాలనచేస్తున్నాడని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, తీవ్రంగా విమర్శంచారు బుధవారం నాడు కేంద్రం ప్రభుత్వం పెంచిన చమురు ధరలు,వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైనా కార్పొరేట్ల కుమ్ముగాస్తు దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు, పన్నులు పెంచి వాళ్ల వెన్ను వీరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు-కుడాయి రేట్లు తగ్గిన ఇక్కడ పెట్టుబడిదారుల కు వత్తాసు పలుకుతూ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు అన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ ను మించిన మతి లేని పరిపాలన చేస్తున్నాడు అన్నారు. ప్రజల మస్థికాన్ని పక్కదోవపట్టిస్తు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండ "మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు" ఇట్లా ప్రజలను మరింత భారం వేయడం శోచనీయం అన్నారు. కేంద్రం పేదల పొట్టకొట్టడం తప్ప పేదలను ఆదుకున్నది లేదు అన్నారు. కోటిశ్వరులకు మేలు చేసేందుకే చమురు - వంట గ్యాస్ లను పెంచి తమ నైజం చాటుకున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పెంచిన ధరలను తాగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కార్యక్రమంలో పీ.వో. డబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పీ. రమ, సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి ఆర్. పుష్పలత, డివిజన్ నాయకులు ఈ.జెమున, ఎస్.గంగామణి, మండల నాయకులు ఎం.లత, పి.రాజమణి, ఎం.మనక్క, ఎస్.బాలమణి, సీపీఐ(ఎం ఎల్)మాస్ లైన్ మండల నాయకులు ఎం. లింబాద్రి, ఈ.రమేష్,బి.కిషోర్, ఎస్, కిషోర్, బి.గంగామల్లు, ఎం.పండారి, బి.లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.