బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాకు పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత తృతీయ సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు మోహన్ మరియు బ్రహ్మానంద రెడ్డి లు పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ఫలితాలను త్వరలో తెలియజేస్తామన్నారు కళాశాల ప్రిన్సిపాల్ కె .అశోక్ మాట్లాడుతూ ఎంఎస్ఎన్ (MSN)కంపెనీ తో ఏం ఓ యు(MOU) కుదుర్చుకున్నామని ప్రతి ఏటా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ బాబు , రసాయన శాస్త్ర అధ్యాపకులు T.సంతోష్,R.హన్మండ్లు అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.