జనం న్యూస్ 9-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా
సంగారెడ్డి జోగిపేట పట్టణంలో జోగినాథ స్వామి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా బండ్ల ఊరేగింపు క్లాక్ టవర్ నుంచి ప్రారంభమై గౌని చౌరస్తా నుండి హనుమాన్ చౌరస్తా మీదుగా జోగినాధ స్వామి దేవాలయం చేరుకొని గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేశాయి. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆనవాయితీ ప్రకారం పద్మశాలీలు స్వామివారికి సెల్ల (వస్త్రం) నేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం వివిధ గ్రామాల్లోని భక్తులు జోగినాథ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జనం న్యూస్ 9-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో జోగినాథ స్వామి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా బండ్ల ఊరేగింపు క్లాక్ టవర్ నుంచి ప్రారంభమై గౌని చౌరస్తా నుండి హనుమాన్ చౌరస్తా మీదుగా జోగినాధ స్వామి దేవాలయం చేరుకొని గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేశాయి. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆనవాయితీ ప్రకారం పద్మశాలీలు స్వామివారికి సెల్ల (వస్త్రం) నేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం వివిధ గ్రామాల్లోని భక్తులు జోగినాథ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.