చేల్పూరి రాము..
జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరీ రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్, డీజిల్, ధరలను వెంటనే ఉపసరించుకోవాలని ఈ సందర్భంగా మండల కార్యదర్శి రాము కేంద్ర ప్రభుత్వ విధానం సరైనది పద్ధతి కాదు అని అన్నారు. పెంచిన ధరలు పేద మధ్యతరగతి ప్రజల మీద, అధిక భారం పడుతుందని తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగుతున్నప్పటికీ దేశంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం మాత్రం ధరలను పెంచుకుంటూ పోతుంది అని విమర్శించారు. ఇప్పటికే నిత్యవసరాల ధరలతో అతలకుతులమవుతున్న కరీంనగర్ జిల్లా మధ్యతరగతి పేద ప్రజలపై ఒక నెల సుమారు 600 కోట్ల భారం పడుతుందని వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని హెచ్చరించారు.