జనం న్యూస్ ఏప్రిల్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్
హైదరాబాద్ ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు అమెరికాలో దారులన్నీ మూసుకుపోయాయి. భారత్‌కు అప్పగించొద్దం టూ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో భారత్‌కు అప్పగించేందుకు అమెరికాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను భారత్‌కు తరలిస్తున్నట్లు వర్గాలు పేర్కొ్న్నాయి. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారు జామున తహవూర్ రాణా భారత్‌కు చేరుకోన్నాడు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో తహవూర్ రాణాను అప్పగించాలం టూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మోడీ కోరారు. అందుకు ట్రంప్ అంగీక రించారు. ఈ విషయాన్ని సంయుక్త విలేకర్ల సమావేశంలో ట్రంప్-మోడీ తెలిపారు. 2008, నవంబర్‌లో జరిగిన ముంబై దాడుల్లో తహవూర్ రాణా పాత్ర కీలకమైంది. నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. పాకిస్తానీ- అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా సహచరుడు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని గుర్తించింది.పదేళ్ల నుంచి అమెరికా జైల్లో రాణా మగ్గుతున్నాడు…