జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ డ్యాం వద్ద వైజాగ్ సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలకు డ్యాం భద్రత అప్పజెప్పినందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ హిరే కార్ రమేష్ జి మాట్లాడుతూ కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్యామ్ భద్రతను కాపాడారని, ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం డ్యాం భద్రతను తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బందికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు , ఆంధ్ర సిఆర్పిఎఫ్ వారి ఆధీనంలోకి డ్యాo ఉంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుందని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సంప్రదింపులు చేసుకొని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బందికి డ్యాం భద్రత మొత్తం అప్పగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు, లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ నాయక్, మక్షుద్ , సేకరాచారి, గాజుల రాము, రామస్వామి, ఏసు, రవికిష్ణ, హైమద్, సైదులు తదితరులు పాల్గొన్నారు.