జనం న్యూస్. ఏప్రిల్ 9. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
నర్సాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పడ్డ ఎస్.ఆర్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్ ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కట్ట సంతోష్ కుమార్ అతని కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో. బి ఆర్ ఎస్. నాయకులు నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్.మెదక్ జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్ , కురుమ శ్రీశైలం, నర్సింగరావు,పంబాల బిక్షపతి, జితేందర్ రెడ్డి,సేనాధిపతి,కర్నాకర్ , సూరారం నర్సింలు, తంగేడుపల్లి ఆంజనేయులు, తొంటవినయ్.సద్దాం.చింత స్వామి.సార మాణిక్యం,శ్రీనివాస్ రెడ్డి,రాజా గౌడ్,నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.