జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు. బుధవారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ బండపై రూ.50 నీ వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను 50 రూపాయలకు పెంచడం మూలంగా గ్యాస్ ధర 876 నుండి 905 వరకు పెరగడం మూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల కాలం నుండి పెట్రోల్. డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరను ఇష్టాసారంగా పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక నిత్యవసరది వస్తువులు ధరలు పెరిగి పెరిగిన ధరలతో తీవ్ర
ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ధరల మీద ధరల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గ్యాస్ బండ మోపటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అంతర్జాతీయ వ్యాప్తంగా రాయల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరను తగ్గించిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాల మోపుతుందని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించేంతవరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వీరబోయిన వెంకన్న. సింగిల్ విండో డైరెక్టర్ వెంపటి వీరబ్రహ్మం.ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఖాజాబీ. సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిలు భూతం వెంకన్న. దైద సైదులు డివైఎఫ్ఐ నాయకులు షేక్ ఖాదర్. డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్షుడు దాసరి గురవయ్య. కార్యదర్శి వెంపటి స్టాలిన్. పార్టీ సభ్యులు కోడి వెంకన్న. కోడి లింగరాజు. నబి సాహెబ్. మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు