జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ //జమ్మికుంట)
జమ్మికుంట మున్సిపాలిటీలో ఫీట్టర్ గా పనిచేస్తున్న సంపత్ రావు మొదటి నుండి ప్రతి పనిలో వివాదాస్పదమే, ఉద్యోగం నిర్వర్తిస్తూనే, అతనికి ఇతర వ్యాపరాలు ఉన్నట్లు సమాచార, వార్తల్లోకి ఎక్కడమే కాకుండా పలువురిపై అతనికున్న అర్థబలాన్ని ఉపయోగించుకొని పలువురిపై బెదిరింపులకు గురిచేస్తూ కేసులు సైతం నమోదు చేయడం ఇతనికి ఇతనే సాటి, అని ప్రచారం, ఇలాంటి వ్యక్తి పై గతంలో సామాజిక కార్యకర్త పబ్బు శ్రీనివాస్ అతడు ఉద్యోగంలో చేరిన సర్టిఫికెట్లు నకిలీవని, సిడిఎంఏ హైదరాబాద్ కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం వరంగల్ ఆర్టిఎంఏ షాహిద్ మసూద్ విచారణకు వచ్చారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఫిట్టర్ గా పనిచేస్తున్న సంపత్ రావు గతంలో నల్ల పన్నుల విషయంలో పత్రికలో వచ్చిన కథనంపై పలువురు ఫిర్యాదు చేయడంతో, వారిపై పోలీస్ స్టేషన్లో సైతం అక్రమంగా డబ్బులు,, డిమాండ్ చేస్తున్నాడని చెప్పి అతనికున్న అర్థబలాన్ని ఉపయోగించి అక్రమ కేసులు బనాయించినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం కింద పబ్బు శ్రీనివాస్, సదరు ఫీట్టర్ సంపత్ రావుకు సంబంధించిన, ఉద్యోగ నియామక పత్రాలకు సంబంధించిన జిరాక్స్ పత్రాలు కావాలని అడగగా, అతనిపై కక్ష సైతం పెంచుకొని, అట్టి విషయంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక పెద్ద మనిషిగా వచ్చినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై కులం పేరుతో దూషించడంతో, ఆ కేసు విషయంలో అతనిపై ఎస్సీ/ఎస్టీ కేసు సైతం సంపత్ రావు పైన నమోదు అయింది,అయినప్పటికీ అతని తీరులో మార్పు రాకపోగా మరింత దురుసుగా ప్రవర్తిస్తుండడంతో విసిగి చెందిన దరఖాస్తుదారుడైన పబ్బు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలోని సిడిఎంఏ హైదరాబాద్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అతడు చేసిన ఫిర్యాదుకై స్పందించి బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు వరంగల్ ఆర్టిఎంఏ షాహిద్ మసూద్ సంబంధిత అధికారి జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదుదారునీ సమక్షంలోనే విచారణ చేపట్టారు. ఈ విషయంతో అక్కడ ఏం జరుగుతుందో అని ఆసక్తిని కలిగించినప్పటికీ, అతని సర్టిఫికెట్లు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారి తెలియజేశారు. దీంతో దరఖాస్తుదారుడు సైతం వచ్చిన అధికారి పైన పూర్తి విశ్వాసం ఉందని, సదరు సంపత్ రావు పై చర్యలు తీసుకోలేని యెడల ఆ పై స్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సంపత్ రావు పై, దురుసుగా ప్రవర్తిస్తున్న తీరుపై, ఓ పత్రిక విలేఖరి సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల హుజురాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీ ఇంటి నెంబర్ 7-4-17/1, 7-4-17/2 ఇంటి నెంబర్లలో కందికట్ల సంధ్యారాణి భర్త మధుసూదన్ (మాజీ సర్పంచ్ కోరపల్లి) అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టగా.. సదరు ఇంటి నిర్మాణాన్ని సక్రమంగా చేసుకొనేందుకు హుజురాబాద్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళగా.. విషయం తెలుసుకున్న సదరు పత్రిక విలేకరి సంబంధిత అంశంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా… సదరు రిజిస్ట్రార్ కందికట్ల మధుసూదన్ ని రమ్మని పిలువగా సంపత్ రావు రావడమే కాకుండా ఫిబ్రవరి 28, 2025 రోజున డ్యూటీలో ఉన్న సమయంలో అక్కడికి మధుసూదన్ కి బదులు ఇతడు అక్కడికి వచ్చాడు. ఇట్టి విషయాన్ని పత్రికలో ప్రచురితం కావడంతో… సదరు పత్రిక రిపోర్టర్ పై అక్రమ కేసును బనాయించేందుకు సైతం సంపత్ రావు వెనుకాడలేదు. ఎవరన్నా తనని ఉద్యోగ విషయంలో ప్రశ్నించిన, వార్త రాసిన, డబ్బులు నన్ను డిమాండ్ చేశాడనే ఒకే ఒక కారణంతో ప్రతి ఒక్కరిని కేసులు బనాయించడం ఇతనికి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికైనా ఇతనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత విచారణ అధికారి అయిన వరంగల్ ఆర్టీఎంఏ షాహిద్ మసూద్ (జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి బుధవారం విచారణ అధికారిగా వచ్చిన) ఫిర్యాదు చేయడంతో దానిని పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ చేసిన తదుపరి చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఇప్పటికైనా సదరు ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అక్రమార్కులకు వత్తాసు పలకకుండా నిర్వహించేలా సంబంధిత మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విచారణలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్, మేనేజర్ జి రాజిరెడ్డి, గుర్రపు శ్రీనివాస్ (మేనేజర్ ఆర్డి ఆఫీస్) తదితరులు పాల్గొన్నారు.