జనం న్యూస్ 10 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా
ప్రజలలో పోలీస్ వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా విధులు నిర్వహించాలి పోలీస్ అధికారుల సమావేశంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు : పంట పండించే ఏ రైతు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా లోకి నకిలీ విత్తనాలు రావడం గానీ, వినియోగం కానీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు.
రెండు రోజుల పాటు గౌరవ రాష్ర్ట డీజీపి రాష్ట్రం లోని అన్ని పోలీస్ కమిషనరేట్ ల పోలీస్ అధికారులతో, జిల్లా ఎస్పీ లతో నేరాల పై రివ్యూ సమావేశ నిర్వహించి పలు సూచనలు ఇచ్చిన సందర్బంగా బుధవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజాలలో పోలీస్ పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా చేపట్టాల్సిన విధులు, నేరాల నియంత్రణ , శిక్షల శాతం పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే వర్ష కాలం ను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ జిల్లా లోకి రావడం గాని, జిల్లా నుండి రవాణా కానీ జరగకుండా పూర్తీగా నియంత్రించాలని , అందుకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని, అవసరం ఐతే పి డి యాక్ట్ క్రింద కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించారు. ఆరుగాలం శ్రమించి పంటలను పండించే రైతన్న నకిలీ సీడ్స్ తో మోసపోకుండా చూడాలని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసి నిఘా తో పాటు తనిఖీలు నిర్వహించాలని మరియు నకిలీ సీడ్స్ పై ప్రజలను చైతన్యం చెయ్యాలని అన్నారు. ప్రజలకు పోలీస్ పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా పోలీస్ విధులు ఉండాలనీ, వచ్చిన పిర్యాదు పై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని, ఆయా కేసులలో నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెరిగేలా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని , ట్రయాల్స్ సమయంలో ఉన్నతాధికారులు మానిటర్ చెయ్యాలని, అలాగే టెక్నాలజీ వినియోగం ను, పోలీస్ మాన్ పవర్ ను మాక్సిమం ఉపయోగించుకోవాలని అన్నారు. రైటర్స్ , సి సి టి యన్ యస్ , రిసెప్షన్, సిడిఓ యస్ కు వర్టికల్ వారిగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్, ప్రాపర్టీ నేరాలు జరుగకుండ ముందస్తు సమాచారం తోనే నియంత్రించాలని, రాత్రి గస్తీ ను మరింత పెంచాలని అవసరమైతే పట్టణాలలో సైక్లింగ్ చేస్తూ గస్తీ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్స్ ను గుర్తించి ఆ ప్రాంతాల్లో తగిన మార్పులు చేర్పులు చేపట్టాలని, ప్రతీ ఫ్యాటల్ రోడ్డు ప్రమాదం ను యస్ యచ్ఛ్ ఓ స్వయంగా సమీక్షించాలని అన్నారు, రోజూ ఎక్కువ మొత్తం లో తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు నమోదు చెయ్యాలని అన్నారు. జాతీయ రహదారి జంక్షన్స్ దగ్గర, జిల్లా లోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీ వార్డు లలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని, ఏర్పాటు చేసిన చోట పని చెయ్యని కెమెరాలను పునరుద్ధరించడం లేదు మార్పు చెయ్యడం చెయ్యాలని అన్నారు. అన్ని కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించి పర్యవేక్షించాలని అన్నారు. అధికారులు తమ పరిధిలో శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి అని, నిత్యం ఫీల్డ్ లో ఉండాలనీ, హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి పై రౌడీ షీట్స్ ఓపెన్ చెయ్యాలని అన్నారు. సోషల్ మీడియా లో ఎల్లపుడూ నిఘా ఉంచాలని, గ్రామ లలో వాట్సాప్ గ్రూపులల్ సైతం నిఘా ఉంచాలని అన్నారు. మహిళ ల పై జరిగే నేరాలు, వేధింపుల పై అలసత్వం వద్దని, అట్టి ఫిర్యాదుల పై వెంటనే స్పందించాలని సూచించారు. బెట్టింగ్ వ్యసనం వైపు యువత వెళ్లవద్దని, బెట్టింగ్ లు అడిన, ఆడించిన అట్టి వారి పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల వినియోగం జిల్లాలో కనిపించనప్పటికీ వాటి సరఫరా ,వినియోగం పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలోడి.ఎస్పి వై మొగులయ్య , గద్వాల్, ఆలంపూర్, శాంతి నగర్ సీఐ లు టంగుటూరి శ్రీను, రవి బాబు, టాటా బాబు , సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై, ట్రైనీ ఎస్సై లు, పాల్గొన్నారు.