జనం న్యూస్ 10 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా
డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు. గద్వాల జోగులాంబ జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి R&R సెంటర్ అభివృద్ధి పనులు గాలికి వదిలేశారు అధికారులు. ఔట్ ఫ్లో డ్రైనేజీ కాలువ నిర్మించారు. 410 ప్లాట్లకు గాను రెండున్నర ఫీట్లు మాత్రమే నిర్మించారు. దీనివలన వర్షపు నీరు మరియు మురుగునీరు పంట పొలాల్లోకి వచ్చి పంటకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని పక్కన ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్లో ఉన్న పనులపై జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత ఆర్ అండ్ ఆర్ ఇరిగేషన్ అధికారులకు, ఎన్నిసార్లు విన్నవించుకున్న చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉందని ఆవేదన వ్యక్టం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చి సమస్య పరిష్కారానికి మార్గం చూపుతారని ఆశిస్తున్నాము .