మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇ.నర్సింహమూర్తి
జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన అత్యాచారం, నమ్మించి
మోసగించిన కేసులో నిందితుడైన విజయనగరం పట్టణానికి చెందిన మొయిద పైడిరాజుకు విజయనగరం 5వ ఎడిజె మరియు మహిళా కోర్టు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.10,000/-లు జరిమానా విధిస్తూ ఏప్రిల్ 10న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇ.నర్సింహ మూర్తి తెలిపారు. విజయనగరం పట్టణం దాసన్నపేటకు చెందిన నిందితుడు మొయిద పైడిరాజు అనే వ్యక్తి పట్టణానికి చెందిన ఒకామెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, అత్యాచారంకు పాల్పడినట్లుగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు తో మహిళా పోలీసు స్టేషనులో 2021 సం॥లో అప్పటి ఎస్ఐ పి.శ్యామలాదేవి కేసు నమోదు చేయగా, అప్పటి మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్ దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను త్వరతగతిన పూర్తి చేసి నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నిందితుడు మొయిద పైడిరాజు ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన మోనం చేసినట్లుగా నేరం రుజువు కావడంతో 5వ ఎడిజె మరియు మహిళా కోర్టు న్యాయమూర్తి ఎన్. పద్మావతి గారు నిందితుడు పైడిరాజుకి ఒక సంవత్సరం కఠిన కారాగారం మరియు రూ.10,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎన్.శకుంతల
వాదనలు వినిపించగా, విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరు ఇ.నర్సింహమూర్తి పర్యవేక్షణలో కోర్టు నిస్టేబులు జి.సూరపు నాయుడు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారన్నారు.