జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్చగా జీవించగలుగుతున్నాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం గురువారం మండలంలోని కొప్పుల గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలసి జై బాపు, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ… జాతిపిత గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ర్యాలీ వల్ల జై బాపు, జై భీం, జై సంవిధాన్ ప్రజలలో చొచ్చుకుపోవడంతో పాటు రాజ్యాంగం, అంబేద్కర్ ను అవహేళన చేసే బీజేపీ పెద్దలకు కనువిప్పు కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ మండల నాయకులు పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ (బుజ్జన్న ) చిందం రవి మాజీ. జెడ్పీ టిసి చల్లా చక్రపాణి శంకర్ మధుసూదన్ వైనాల కుమారస్వామి మారేపల్లి కట్టయ్య దుబసి కృష్ణమూర్తి జగన్ రాజు రవీందర్ రామ్ రెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు……