జనం న్యూస్- ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ జెన్కో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి, జెన్కో ఓ& ఎం ఎస్ ఇ రఘురాం రెడ్డి, సివిల్ ఎస్ ఇ రామకృష్ణారెడ్డిలు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రలోని ఒక పేద కుటుంబంలో జన్మించిన జ్యోతిబాపూలే పేద ప్రజల అభ్యున్నతి కోసం మహిళల సమానత్వం కోసం విద్య కోసం పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు ఆయన చేసిన సంస్కరణలు ఇప్పటికే విద్యార్థులకు అందుతున్నాయని అన్నారు చిన్నతనంలోనే సావిత్రిబాయిని వివాహం చేసుకొని ఆమెకు ఉన్నత చదువులు చదివించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మా జ్యోతిబాపూలేదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఈ సత్య శివకుమార్, నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ హీరేకార్ రమేష్ జి, డాక్టర్ శ్రీనివాస్ జెన్కో బీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు వెంకటరమణ, ఆర్ ఎల్ ప్రసాద్, శేఖర్ ఆచారి, రామస్వామి, బాలకృష్ణ, ఉద్యోగ సంఘాల నాయకులు శివ ,సత్యనారాయణ, నాగరాజు, అనురాధ, భాగ్యలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.