జనం న్యూస్, ఏప్రిల్ 12( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే,కి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ పి డి ఎం రాష్ట్ర కో కన్వీనర్ కొమ్ము దుర్గారాo, బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్, మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే, 11 ఏప్రిల్ 1827 జన్మించారు. ఆయన ఒక భారతీయ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత . అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం పోరాటం చేశారని వారిని స్ఫూర్తిగా తీసుకొని అడుగు జాడల్లో నడవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఎఫ్ టి యు సిద్దిపేట జిల్లా కన్వీనర్ శివరాత్రి శ్రీనివాస్, రామంచాములు, దబ్బేట నర్సింలు ,రాజు ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.