దరఖాస్తు చేసుకున్న సకాలంలో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల రాక నష్టపోతున్న యువత
ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే.చాంద్ పాషా
జనం న్యూస్,ఏప్రిల్11, జూలూరుపాడు :
యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గడువును పెంచాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే.చాంద్ పాషా కోరారు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల సకాలంలో దరఖాస్తు చేసుకున్న సాంకేతిక లోపాలతో సకాలంలో రాలేదని,గడువు ఈనెల 14వ తేదీ తో ముగించటంతో దరఖాస్తుదారులు నష్టపోయే అవకాశం ఉన్నందువలన రాష్ట్ర ప్రభుత్వం గడువును పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు ప్రభుత్వ సెలవులు ఉండటం వల్ల దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన కు గురవుతున్నారని నెట్ సెంటర్ కు వెళ్లి ఆన్లైన్ చేస్తే సాంకేతిక లోపాలతో పనిచేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వం గడువును పెంచాలని డిమాండ్ చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు కార్పొరేషన్ ద్వారా ఉపాధి పొందేందుకు దరఖాస్తు చేసుకుంటే నిజమైన లబ్ధిదారులకు రాకుండా నష్టపోయారని గత ప్రభుత్వము లాగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.