జనం న్యూస్ 11 ఏప్రిల్వికారాబాద్
జిల్లా పరిగి లో మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 198 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. సమాజం లో కుల వివక్ష అంటరాని తనం పై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘాసమస్కార్త మహాత్మా జ్యోతి బా ఫూలే , విద్య లేకపోతె మనిషికి జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతె సంపద లేదు సంపద లేకపోతె సమాజంలో గుర్తింపు లేదు అని గొప్ప సందేశాన్ని ఇచ్చిన సంఘాశంస్కర్త బహుజనుల బతుకుల్లో వెలుగు నింపిన మహనీయుడు అణగారిన వర్గాల గొంతుక కుల కులవ్యవస్థ పై పోరాడిన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు మహాత్మా జ్యోతిభా ఫూలే గారి విగ్రహానికి పూలమాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. యువత ఫూలే మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంపీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్ట్యా నాయక్, జేఏసీ జిల్లా నాయకులు ముకుంద నాగేశ్వర్, చేర్క సతయ్య రిటైడ్ టీచర్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్, బీఎంపీ దోమ మండల అధ్యక్షులు రవీందర్ నాయక్, బ్రాహ్మణ పల్లి ex M P T C భీమా నాయక్, అంబేద్కర్ సంగం తాలూకా నాయకులు సాలెటి వెంకట్, రాములు, శంకర్, రమేష్, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.