కురిమెల్లా శంకర్ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బహుజన్ సమాజ్వాది పార్టీ
జనం న్యూస్ 11 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్రీమతి ఇందిరా అధ్యక్షతన జరిగిన 198వ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బహుజన్ సమాజ్వాది పార్టీ నాయకులు కురిమెళ్ళ శంకర్ మాట్లాడుతూ 18వ శతాబ్దంలో మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే తనకు ఎదురైనా అవమాన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఆ రోజుల్లోనే మనువాదులకు వ్యతిరేకంగా సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి అనేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆమె ద్వారా దళిత స్త్రీలకు, అనగారిన వర్గాల మహిళలను చేరదీసి చదువును నేర్పించారు అట్టడుగు వర్గాల ప్రజల ఆత్మగౌరవంతో బ్రతకాలని దానికి మూలం విద్యనని ఆ విద్యను ప్రజలందరికీ ఒక ఉద్యమంలో చేరవేయడంలో సఫలీకృతమైనరు ఆనాడు వారు వేసిన బీజం ఈరోజుఎంతోమంది స్త్రీలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు అభివృద్ధితో ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు అంతేకాదు పూలే గారు కన్న కలలు సమ సమాజం ఏర్పడాలని దానికి మూలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు రాజ్యాధికారాన్ని సాధించినట్లయితే తప్పకుండా సమ సమాజం ఏర్పడుతుందని ఆ దిశగా బహుజన్ సమాజ్ వాద్ పార్టీ ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీ వర్గాలను వారిలో చైతన్యాన్ని నింపి రాజ్యాధికారం సాధించి పూలే కలలుగా అన్న సమాజం ని స్థాపిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్మించాలని అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ బీసీ నాయకులు బండి రాజు గౌడ్ మిట్టపల్లి సాంబయ్య అంకినీడు ప్రసాద్ గుమలాపురం సత్యనారాయణ భూపతి శ్రీనివాస్ రాంబాబు, బుర్ర జయమ్మ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు