జనం న్యూస్ 11 ఏప్రిల్ ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ )
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్ట కోడూరు ఉన్నత పాఠశాలలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు లక్నాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పూలే మహారాష్ట్రలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. మహాత్మ జ్యోతిబాపూలే భారతదేశంలో బానిసత్వం కుల వ్యవస్థ మూఢనమ్మకాలు వీటివల్లనే దేశం వెనుకబడిపోయిందని అభివృద్ధి చెందడం లేదని తెలియజేశారు. ఫూలే సుమారు 100 సంవత్సరాల పూర్వమే సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అణిచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆస్తి ఆత్మస్థైర్యం కల్పించి వారిని సాధికారతవైపు నడిపించిన సూత్రధారి పూలే తన 21 ఏటనే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఎదురోడ్డాడు. పూలే గొప్ప సంఘసంస్కర్త వివక్ష అంతం కోసం మార్గం చూపిన ఆలోచనపరుడు గొప్ప సంఘ సేవకుడు తన రచనలతో ఆనాటి సామాజిక రుగ్మతలను రూపుమాపిన గొప్ప తత్వవేత్తగా చెప్పవచ్చు అని తెలియజేశారు. అయితే విద్యార్థులు మహనీయుల ఆశలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి గొప్ప వ్యక్తులుగా సమాజంలో పేరు పొందేటట్టు అభివృద్ధి పథంలో నడవాలని తెలియజేశారు. గొప్ప గొప్ప ఆశయాలను ఏర్పరచుకొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని సూచించారు. స్త్రీలు విద్యావంతులైతేనే ఆ కుటుంబం మొత్తం చదివిస్తుందని నమ్మి తన భార్య సావిత్రిబా యి పూలే పూలేను చదివించి ఆదర్శప్రాయుడుగా స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలను స్థాపించి చదువు చెప్పించాడు. శూద్రులకు చదువు నిషేధమున్న సమయంలో స్త్రీలకు శూద్రులకు పాఠశాలలు ఏర్పాటు చేసి సుమారు 18 పాఠశాలకు స్థాపించి విద్య లేనిదే వివేకం లేదు వివేకం లేక నీతి లేదు నీతి లేనిదే పురోగతి లేదు పురోగతి లేనిదే విత్తం లేదు విత్తము లేనిదే శూద్రులు ఆదేవుగతి పాలయ్యారు అని అన్ని అనర్థాలకు మూలం విద్యనే అని చెప్పాడు. అందుకే పూలే యొక్క గొప్పతనం తెలుసుకొని దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో పేదలు మహిళలు చదువుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని కోరుతూ మహనీయుల త్యాగాల ను స్మరించుకోవాలని విద్యార్థులతో కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, శరత్ బాబు, సాదికలి మధుసూదన్ రావు, కవిత, చాత్రోపాధ్యాయులు రవి, సురేష్, భార్గవి, అభినయ, అనసూయ, విద్యార్థులు పాల్గొన్నారు.