భద్రాచల కల్యాణనికీ అందించి, గజ్వేల్ కళ్యానానికి అదిస్తున్న
రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి
జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
గజ్వేల్ లో ఈ నెల 22న జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కళ్యానానికి గోటి తలంబ్రాలను అందించాలని శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. దీనికి సంబందించిన గోటి తలంబ్రాలు (వడ్లు) ప్యాకెట్లను శుక్రవారం నాడు ఆవిష్కరించారు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ గత 26 సంవత్సరాలనుండి ఎన్నో సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భద్రాచలం సీతారాముల కళ్యానానికి ఈ మద్యే 250కిలో గోటి తలంబ్రాలు అందించిన ఘనత రామకోటి రామరాజుదే అన్నారు. మూడు సార్లు భద్రాచల కల్యానానికి అందించడం అనేది అభినందనీయం అన్నారు. అలాగే ఈ నెల 22తేదీన గజ్వేల్ లో జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కళ్యానానికి గత సంవత్సరం గోటి తలంబ్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు అందించారు. అదే విధంగా ఈసారి కూడా భక్తులచే ఓలిపించి అందించాలనేది రామకోటి రామరాజు సంకల్పం గొప్పదన్నారు. రామకోటి రామార్జు నిర్వీరామ సేవ అమోఘం అన్నారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోటి తలంబ్రాలను ఓలిపించి తనలో ఉన్న రామభక్తిని ప్రతి ఒక్కరిలో గ్రామ, గ్రామాన మేల్కొల్పాడు రామకోటి రామరాజు. గజ్వేల్ సీతారామ ఉమామహేశ్వరుల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించడం రామకోటి రామరాజుకే సాధ్యం అన్నారు.