* రూ.10 లక్షలు మంజూరు చేస్తా..
* పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ..
* నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం.
జనం న్యూస్, జనవరి 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన కమిటీ పాలకవర్గ ఛైర్మన్ బొడ్డుపల్లి సదయ్య, ధర్మకర్తలు శ్రీపతి సుమన్, ఆడెపు సౌందర్య, ఇట్యాల సతీష్, తాల్లపల్లి రాజమౌళి, గాజుల సురేష్, ముడుసు శ్రీనివాస్, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆలయ పూజారి లక్ష్మీ నరసింహ చార్యులను దేవాదాయ ఇన్స్పెక్టర్ సుజాత, కార్యనిర్వాహక అధికారి ముద్దసాని శంకర్
గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజయరమణ రావు పాలక మండలి సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు.
అంతకు ముందు ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ...
పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ. లక్ష్మి నరసింహ స్వామీ వారి ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఆలయ ఆవరణలో పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసేల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే విజయరమణ రావు అభినందించారు. అందుగులపల్లి నుండి దేవునిపల్లి వరకు నిర్మిస్తున్న తారు రోడ్డు అర్థాంతరంగా ఆగిన విషయాన్ని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే రోడ్డు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆలయ అభివృద్ధిలో తాను ముందుంటానని తెలిపారు.
అనంతరం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసిన ఈఓ శంకర్ ను ఎమ్మెల్యే అభినందించారు..
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, అప్పన్నపేట సింగిల్ విండో ఛైర్మన్ చింతపండు సంపత్, బొక్కల సంతోష్, కౌన్సిలర్ నూగిల్ల మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు ఎడెల్లి శంకర్, బొంకూరి అవినాష్, ఆరె సంతోష్, కలబోయిన మహేందర్, గుర్రాల రాజు, చీకటి లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.