జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్)
మండలంలోని వెదురుపాక గ్రామంలో గౌరీ శంకరుల జాతర మహోత్సవాన్ని గురువారం గౌరీ శంకర తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం వారు ఘనంగా నిర్వహించారు. రెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే ఈ జాతర మహోత్సవంలో భాగంగా వివిధ రకాల వేషధారణలతో గౌరీ శంకర్లను ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. దేవతామూర్తుల అవతారంలో ట్రాక్టర్ పై వివిధ వేషధారణలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. విజయదశమికి వరి దుబ్బును, పౌర్ణమికి అమ్మవారిని తీసుకుని వచ్చి ఆలయంలో పూజ నిర్వహిస్తామని, అట్లతద్ది రోజున గ్రామోత్సవం నిర్వహిస్తామని నాటి నుంచి నేటి వరకు సుమారుగా మూడు నెలలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ముక్కనుమ రోజున అమ్మవారికి ఘనంగా జాతర నిర్వహిస్తామని సంఘ ప్రెసిడెంట్ తుంపాల లోవరాజు, సెక్రటరీ గోకాడ దుర్గాప్రసాద్ విలేకరులకు తెలియజేశారు. ఈ జాతర మహోత్సవానికి గ్రామ ప్రజలతోపాటు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని గౌరీ శంకర్ లను దర్శించారు