ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలి
సిపిఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్
జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కాగజ్ నగర్ ---వాంకిడి మండలాల మధ్యగల మెట్పల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నాయకులు ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మెట్పల్లి వాగును ముంజం ఆనంద్ కుమార్ సందర్శించారు. బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సుమారు రు.10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించబోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే కాగజ్ నగర్, వాంకిడి తదితర మండలాల్లోని గ్రామాల ప్రజలకు సౌకర్యం గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా దూరం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జాడి మల్లన్న దుర్గం రాజ్ కుమార్ పాల్గొన్నారు