జనం న్యూస్ జనవరి 16 (మాచర్ల ) :- మాచర్ల మున్సిపల్ ఆఫీస్ లో జరిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మేళ లో ముఖ్యఅతిథిగా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ మేళాను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ మాచర్లలో కక్షలు , కార్పణ్యాలు, గొడవలు దూరంగా ఉండి యువత అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు . యువత ఇక్కడే కూర్చుంటే లక్ష్యాలను సాధించలేరని అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే విజయం సాధించగలరని అన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వేణుబాబు , మున్సిపల్ ఛైర్మన్ పోలూరి నరసింహరావు , మాచర్ల పట్టణ టీడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు , టీడిపి నాయకులు యేనుముల కేశవరెడ్డి , మద్దిగపు వెంకటరామిరెడ్డి , సూర్య , ఎలమంద, టీడిపి నాయకులు కంభంపాటి అనీల్ , మున్నా రాంబాబు ,నేరేటి వీరస్వామి , పేరువాల పుల్లారావు , బండారు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు