గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

జనం న్యూస్, ఏప్రిల్ 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారం గా మలుచుకొని అమాయక యువతను గంజా మత్తుకు బానిసలను చేస్తూ పలుకేసులలో నిందుతుడు అయిన షేక్ ఆసిఫ్@ షేర్ ఆసిఫ్ అరెస్ట్. నిందుతుని వివరాలు: షేక్ ఆసిఫ్@ షేర్ ఆసిఫ్, తండ్రి పేరు: షేక్ చాంద్, వయస్సు:36 సంవత్సరాలు, ముస్లిం r/o బండారికుంట, పెద్దపల్లి రికవరీ:
- ఎండు గంజాయి: Rs.50,000/- విలువగల (2041.7 గ్రాములు)
- ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్
- సెల్ ఫోన్ Redmi కంపనీ
- yamaha (FZS) బైక్.
నేరం చేసిన విధానం:
బండారికుంట, పెద్దపల్లి నివసుడయిన నిందుతుడు ఆటొ నడుపుకుంటూ జివిస్తాడు. ఆటొ నడపగా వచ్చిన డబ్బులు తన అవసరాలకు, జల్సాలకు సరిపోక సులువుగా డబ్బుల సంపదిచాలనే ఉద్దేశంతో, గత కొన్ని సంవత్సరాలు గా మహారాష్ట మరియు వీవిధ ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొని అవసరమైన వారికి ఎక్కువ ధరలకు అమ్మడం, దొంగతనాలకు పాల్పడటం అలవాటుగ చేసుకొన్నాడు. ఈ క్రమంలో పలు మార్లు పోలీస్ వారు పట్టుకొని 2016,2018, 2019, 2021, 2024 సంవత్సరాలలో (8) కేసులు నమోదు అయినాయి. మరియు PD యాక్ట్ కూడా పెట్టిడమయినది. మరియు పెద్దపల్లి PS లో 2024 లో షేక్ శాబాస్ కు గంజాయి అమ్మగా అతని పై కేసు అయిందని తెలిసి పై సందర్బాలలో పెద్దపల్లి పోలిస్ వారు ఇక్కడ అతనిపై నిఘా ఎక్కువ ఉండడం తో ఇక్కడి నుండి మొగ్ధుంపూర్ కు వెళ్ళి అక్కడే ఇల్లు కిరాయికి తీసుకోని ఉంటూ కరీంనగర్ చుట్టూ పక్కల అటో నడుపుతూ, గంజాయి అమ్ముతూ అలా వచ్చిన డబ్బులు తన అవసరాలకు వాడుతున్నాడు. అలా గత కోతకాలం నుండి నాగపూర్ లో ఉండే సల్మాన్ అను వ్వక్తి నుండి గంజాయిని కొనుక్కోనివచ్చి గ్రామాల్లో తిరుగుతూ అవసరమైన వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. ఆదే విధంగా గంజాయి కోసం తేది: 30-03-2025 రోజున పెద్డపల్లి రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ లో నాగపూర్ కు వెళ్ళి యధావిధిగా సల్మాన్ వద్ద 16000/- రూపాయలకు కిలో చొప్పున 4kgs గంజాయిని కొని అట్టి గంజాయిని 10grms ల చొప్పున చిన్న చిన్న పాకెట్స్ చేసి అవసరమైన వారికీ ఒక్కొక్క చిన్న ప్యాకెట్ కు రూ 500/- చొప్పున అమ్ముతున్నాడు. అలా తరచూ పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్దకు వచ్చి గంజాయి తాగే వారికీ Whsts App కాల్స్ చేసి గంజాయి అమ్ముతున్నాడు. యధావిధిగా అతను బైక్ పై పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ దగ్గరకి గంజాయి అమ్మడానికి రాగ పెద్దపల్లి పోలిస్ వారు అతడిని గంజాయి తో సహా పట్టుకోవడం జరిగింది.
నేరస్తుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి CI, K.ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి SI, J.లక్ష్మణ్ రావు, మల్లేశం మరియు సిబ్బంది HC రమేష్, కానిస్టేబుల్స్ K.ప్రభాకర్, K. సతీష్, N. రాజు మరియు M. అనిల్ కుమార్ లను పెద్దపల్లి DCP, P.కరుణాకర్ గారు అభినందినచినారు.