ఎమ్మెల్సీ దండే విఠల్
జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజవర్గం బేజ్జుర్ మండలం బారెగుడ గ్రామాలలో జైబాబు జైబీం జైసంవిదాన్ అనే నినాదంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ నమస్కారం జై భీమ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి విసృతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ దేశంలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలన ఆర్ఎస్ఎస్ భావజాలాలతో కొనసాగిస్తున్నటువంటి బీజేపీ పార్టీ విధానాలను ఎమ్మెల్సీ దండే విఠల్ ఎండగట్టారు.నిండు పార్లమెంట్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవహేళన చేస్తూ మాట్లాడారు అని. ఈ దేశపు రాజ్యాంగన్ని మర్చాలని పదే పదే ప్రయత్నిస్తున్నటువంటి, బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలను ప్రజలకు తెలియచేయాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ సామాజిక సమానత్వాన్ని, బిజెపి ప్రభుత్వం నుండి కాపాడాలని, ఇచ్చినటువంటి రాజ్యాంగ పిటికను చదివి ప్రజలతో కలసి కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ గణపతి టీపిసిసి నెంబర్ అర్షద్ హుస్సేన్ మాజీ ఎంపీపీ నాన్నయ్య బేజ్జూర్ మాజీ ఎంపీపీ రేణుకుంట్లా రేఖ పెంటాన్న చింతల మన పెళ్లి మండల కన్వీనర్ ఉమా మహేష్ మండలాల కోఆర్డినేటర్లు బండి మహేష్ సామల రాజన్న రుద్ర పూర్ మాజీ సర్పంచ్ పెరుగు వందన చింతల మానెపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్ బెజ్జుర్ మాజీ ఉప సర్పంచ్ బాబు రావు నాయకులు బోర్కుట్ శంకర్ బీన్కరి నారాయణ విజయ్,కొండు శంకర్, మారుతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు అభిమానులు ఉన్నారు