ఏప్రిల్ 13 జనం న్యూస్జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్
లక్ష్మణ్హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు మద్నూర్మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు..ఎమ్మెల్యే పేరిట నాయకుల పేరిట అర్చన చేశారు.పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు.రామభక్తుడు, వాయునందనుడు, పవనసుతుడు అయిన ఆంజనేయుడి అనుగ్రహం, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని..హనుమంతుడి దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు . ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్, తదితరులు పాల్గొన్నారు