జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయకవిజయనగరం
పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల నవరంగ్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద అర్ధరాత్రి మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం రాగా వన్ టౌన్ CI S శ్రీనివాస్ మరియు సిబ్బంది ఆకస్మికంగా రైడ్ చేసి బార్ అండ్ రెస్టారెంట్ మెట్ల మీద మద్యం బాటిల్స్ పెట్టుకుని అధిక ధరకు అమ్ముతున్న ఆసామిని పట్టుకుని రాత్రి 11 గంటల తర్వాత బార్ లో మద్యాన్ని విక్రయించడం చట్ట ప్రకారం నేరమని తెలిపి సదరు వ్యక్తి పైన మరియు షాపు సూపర్వైజర్ మరియు యజమాని పైన కేసు నమోదు చేయడమైనది. మద్యం అమ్ముతున్న వ్యక్తి దగ్గర 109 బాటిల్స్ మరియు మద్యం అమ్మిన నగదు( రూ 2860/-)ను సీజ్ చేయడమైనది.