జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయ
కరాజమండ్రి నుంచి నేపాల్‌కు బైక్‌పై వెళ్తున్న బైక్ రైడర్ బి. భార్గవ్ రాజు, ఆయన సతీమణి నాగలక్ష్మి శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నేపాల్ వెళ్లేందుకు బైక్‌పై రాజమండ్రిలో బయలుదేరిన భార్గవ్ రాజు పూసపాటిరేగ మండలం సిహెచ్ అగ్రహారం వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పి ప్రమాదానికి గురికావడంతో భార్లన్ తీవ్రంగా గాయపడగా భార్య నాగలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.