జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం
జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా పని చేస్తూ ఇటీవల గుంటూరు జిల్లాకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా బదిలీ అయిన శ్రీ బి.కళ్యాణ చక్రవర్తి గార్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 11న జిల్లాకోర్టులో మర్యాద పూర్వకంగా కలిసి, పోలీసుశాఖకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపి, జ్ఞాపికనుబహూకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా జిల్లాలోసమర్థవంతంగా పని చేసి, గుంటూరు జిల్లాకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా ఇటీవల బదిలీ అయిన శ్రీ బి.కళ్యాణ చక్రవర్తి గార్ని జిల్లా కోర్టులో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మర్యాద పూర్వకంగా కలిసి, జ్ఞాపికనుబహూకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పోలీసుశాఖకు కళ్యాణ చక్రవర్తి మంచి సహకారాన్ని అందించారనిఆయన సేవలను కొనియాడారు. పోలీసు, న్యాయ శాఖలు సమన్వయంతో పనిచేసి, పలు కేసుల్లో నిందితులు శిక్షింపబడేవిధంగా చర్యలు చేపట్టారన్నారు. 2013సం.లో డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జిగా ఎంపికైన శ్రీ కళ్యాణ చక్రవర్తిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాంపల్లి, మెదక్ జిల్లాల్లోను, రాష్ట్రాల పునర్విభజన తరువాత రాజమండ్రి, కడప, విజయనగరం జిల్లాల్లో పిడిజె గా సమర్ధవంతంగా పని చేసి, న్యాయశాఖ ప్రతిష్టను ఇనుమటింప జేసారన్నారు. జిల్లాలోపని చేసిన కాలంలో పోలీసుశాఖతో సమన్వయంతో పని చేస్తూ, మంచి సహకారాన్ని అందించారని ఆయన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో నూతనంగా బదిలీ అయిన గుంటూరు జిల్లాలో కూడాసమర్ధవంతంగా పని చేసి, న్యాయశాఖ ప్రతిష్టను మరింతగా ఇనుమటింప జేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆకాంక్షించారు.