జనం న్యూస్ ఏప్రిల్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేల రాగడంతో తన గ్రామంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకున్న తీన్మార్ జయ్ అ సమస్యను మండల వ్యవసాయ శాఖ అధికారులకు వివరించి రైతులకు అధికారుల నుండి న్యాయం జరిగేలా కృషి చేశాడు తమ ఓటు వేసి గెలిపించుకున్న నాయకులు చేయవలసిన పని మంచి మనసుతో తమ గ్రామంలోని తీన్మార్ జయ్ రైతుల పక్షాన నిలవడం చాలా సంతోషంగా ఉందని రైతులు ప్రశంసించారు తండా గ్రామంలో 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో చేయించి వారి మన్ననలను పొందాడు తన గ్రామంలో వారం అంగడి స్థాపించి చుట్టుపక్కల గ్రామాలకు కూడా తను ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిచాడు అలాగే ఫ్లోరైడ్ నీటి వాటర్ ఉండకూడదని ఆ తండా గ్రామంలో ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను కొంతమంది దాతల సహాయంతో కలిసి నిర్మిస్తున్నాడు తన పుట్టిన ఊరు తన కన్న తల్లితో సమానమని తన గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేనే నాకు ఆనందంగా ఉంది అని ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని ఎదురు చూడటం చేతగాని తనం అవుతుందని అన్నారు రానున్న స్థానిక సంస్థల్లో ఆ సూర్య నాయక్ తండ గ్రామంలో తాను తప్పకుండా పోటీ లో నిలిచి తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఉందని తీన్మార్ జయ్ అన్నారు ఆ గ్రామంలోని ప్రజలు తీన్మార్ జయ్ చేస్తున్న మంచి పనులకు ఎప్పుడు తనకు అండగా ఉంటామని గ్రామ ప్రజలు తెలియజేశారు...