అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవలి
జనం న్యూస్ ఏప్రిల్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ జిల్లా
తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన మంగి,కొలాంగుడా గ్రామాలలో పర్యటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎఎస్పి యువత , ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు సహకరించవద్దని వెల్లడి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పి డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తరంజన్ ఐపీఎస్ శనివారం తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన మంగి,కొలాంగుడా గ్రామాలను సందర్శించారు. గిరిజన ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లపుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఎఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ అన్నారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ..యువత మరియు ప్రజలు మావోయిస్ట్ ల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, సహకరిస్తారని తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా చిన్నపిల్లలకి బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది మరియు చిన్నపిల్లలను కొలామిలో తాపేర్ అంటూ ప్రేమగా పలకరిస్తూ వారికి తెలుగు అక్షరాలు నేర్పడం మరియు పలకలను(స్లాట్స్) పంపిణీ చేయడం జరిగింది.ప్రజలకు ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని, పేర్కొన్నారు. యువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని పేర్కొన్నారు. యువత ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు , చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. విద్య తోనే అభివృద్ది సాధ్యం అని, పిల్లలు , యువత ను వారి తల్లితండ్రులు ఉన్నత చదువులు చదివించాలి అని తెలిపారు. విద్య, వైద్యం గురించి సహకారం కోసం పోలీసులను ఎల్లప్పుడు ఆశ్రయించవచ్చని, తమకు పోలీస్ శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.గ్రామం లో నిషేధిత గంజాయి సాగు ను పండించవద్దని అన్నారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.