జనం న్యూస్ 13 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు )
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన పాత ఆంజనేయ స్వామి దేవాలయం లో శనివారం హనుమాన్ జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం స్వామి వారికి సింధూరం అభిషేకం,పురుషుల చే సామూహికంగా పంచామృత అభిషేకాలు,మహిళల చే సామూహిక కుంకుమార్చన, సహస్రా పుష్పార్చన,మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం స్వామి వారి పల్లకిసేవ కార్యక్రమం అయ్యగారి ప్రశాంత్ పంతులు ఆధ్వర్యం లో భజన కార్యక్రమాలతో గ్రామమంతా ఊరేగుంపు గా తీయడం జరిగింది. తదనంతరం అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కు కార్యక్రమం ఘనంగా జరుగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి దేవాలయ అర్చకులు గిరీష్ పంతులు ప్రత్యేక ధన్యవాదాలు, ఆశీస్సులు అందించారు. స్వామి వారి కృపా కటాక్షములు అందరి పైన చల్లగా ఉండాలని గిరీష్ పంతులు ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.