ఆ మహనీయుడి ఆశయాలను నేటితరం కొనసాగించాలి…
రాజ్యాంగ నిర్మాత కలలుగన్న సమ సమాజ స్థాపన దిశగా సిఎం రేవంత్ పాలన:నీలం మధు ముదిరాజ్..
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు.
సంబరాల్లో పాల్గొని గ్రామస్థులతో కలిసి కేక్ కట్ చేసిన నీలం..
జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లా
సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికీ స్ఫూర్తిదాయకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తన స్వగ్రామం చిట్కుల్ లో మున్సిపల్ వార్డ్ ఆఫీస్ సమీపంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆ మహనీయుడి జయంతిని పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్, నాయకులు, గ్రామస్థులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు మరియు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని అన్నారు. ప్రజలంతా మొదట విద్యావంతులైతేనే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మి ఆ దిశగా కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అందరికీ దక్కేలా రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు. ఆయన కల్పించిన హక్కుల తోనే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కుల మత అసమానతలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని అంబేద్కర్ కలలుగన్నారని నేడు ఆ కలలను నిజం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, సుంకరి రవీందర్,విష్ణువర్ధన్ రెడ్డి,పొట్టి నారాయణరెడ్డి, ఆంజనేయులు,వెంకటేష్, భుజంగం దుర్గయ్య, గోపాల్, చిన్న, అనిల్, రాజు, కృష్ణ, అనిల్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.