జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లా
పటాన్ చేరు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ…స్వేచ్ఛ సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహనీయుడు అంబేద్కర్ కొనియాడారు. అంబేద్కర్ ఒక నిష్ణాతుడైన రాజకీయవేత్త, నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్త మరియు సామాజిక సంస్కర్త అని, అతను దళిత సమాజ సంక్షేమం కోసం పోరాడాడనీ, అతను అంటరానివారి సమాజం యొక్క ఆర్థిక మరియు సామాజిక సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేశాడనీ అన్నారు. మహిళల హక్కులు మరియు కార్మికుల హక్కుల కోసం కూడా వాదించాడనీ, సెలవు ప్రయోజనాలు, వైద్య సెలవులు,డియర్నెస్ అలవెన్స్,ఉద్యోగుల భీమా మరియు తక్కువ పని గంటలను ప్రవేశపెట్టింది కూడా అంబేద్కర్ అని, భారతదేశంలో భారీ కార్మిక సంస్కరణలను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారనీ, భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు బలహీనవర్గాల ప్రజలకు అందినప్పుడే ఆయనకిచ్చే నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాలు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరియు టీమ్ సభ్యులు శ్రీరామ్, రాకేష్, అత్తర్, రాజేష్, రిషిల్, మనోజ్, విక్కీ, ఆదిత్య, రమేష్, పాల్గొన్నారు.