జనం న్యూస్ 14 ఏప్రిల్, భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండలంలోని నర్సింగపూర్ గ్రామపంచాయతీలో సోమవారం రోజున పార్టీలకు కుల సంఘాలకు అతీతంగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ 134 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, జర్నలిస్టు కాసిపేట రవి మాట్లాడుతూ ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్దల బాపు మాజీ ఎంపీటీసీ దుర్గం శ్రీనివాస్ వార్డ్ మెంబర్ నీలాల తిరుపతి కాంగ్రెస్ నాయకులు కూన సాయి నీలాల పెద్ద రాజయ్య ఆకుల రవి చెవుల నరేష్ నీలాల ప్రశాంత్ రాములు పాల్గొన్నారు