జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపైన ముద్రించాలని కోరుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎన్నార్టీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ రూ.10 నాణెంపైన 2015వ సంవత్సరంలో అంబేద్కర్ జయంతిసాక్షిగా ముద్రించారు. అదేవిధంగా కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ బొమ్మను ఎందుకు ముద్రించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జయంతికి సెలవు దినంగా ప్రకటిస్తే సరిపోదని నోట్లపై ఆయన బొమ్మను ముద్రిస్తేనే నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని, కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక అసమానతలు లేకుండా, రిజర్వేషన్ పరంగా సక్రమమైన ఫలాలు అందించాలన్నారు. ఆ దిశగా నాయకులంతా ఆలోచన చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లపైన ముద్రించకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.