అసమానతలు, దురహంకారంపై అలుపెరుగని పోరాట యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ బీ ఆర్ అంబేద్కర్..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి వాసలా రామస్వామి..
జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో, ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శమని,సమాజంలోని అసమానతలు, దురహంకారంపై అలుపెరుగని పోరాట యోధుడు, సమసమాజ స్వాప్నికుడు దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బీ ఆర్ అంబేద్కర్ అని వాసలా రామస్వామి అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్త, జాతీయవాది, న్యాయకొవిదులు, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తా వద్దా నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారన్నారు.
ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ…దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సామాజిక న్యాయ రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి భావి తరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఒకరికి, ఒకవర్గానికి చెందిన వారు కాదని ఈ సమాజంలోని ప్రజలందరి వాడని, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి, ప్రజల హక్కుల కాపాడిన మహోన్నత వ్యక్తి, అన్నారు.తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ది కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, జాతీయ ఉద్యమంలో, అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటినుంచి సమాజంలోని అనేకుల చే ఎన్నో అవమానాలు ఎదురైన వెను దిరగక వాటిని దైర్యంగా ఎదుర్కొని తన కృషితో కేంద్ర మంత్రి పదవి అలంకరించారని అన్నారు.అంబేద్కర్ వీరి జీవిత కాలంలో అనేకు అబ్జెక్టుల లో 32 డిగ్రీలు పొంది, అనేక గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడిగా నిలిచారన్నారు. విద్యాభ్యాసం తరువాత ఆర్థిక వేత్తగా ప్రొఫెసర్ గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోచించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసి పేద వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి, బీ ఆర్ అంబేద్కర్ తన జీవిత చివరన, బుద్ధిని బోధనలు నచ్చి బౌద్ధ మతం స్వీకరించి మహిళా హక్కులు, కార్మికుల హక్కులు, యితర అన్ని వర్గాల పేద ప్రజల కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా ఈ సమాజం చూడాలని, ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని తెలిపారు.ఇ కార్యక్రమం లో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.