జనం న్యూస్ ఏప్రిల్ 14( ముమ్మిడివరం ప్రతినిధి)
అమలాపురం పుల్లయ్య రామాలయం వీధిలో భారతీయ జనతా పార్టీ అమలాపురం పట్టణ శాఖ అధ్యక్షుడు అరిగెల తేజ వెంకటేష్ అధ్యక్షతన భారత రత్న డా భీమ్ రావ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని అయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, దూరి రాజేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కొండేటి ఈశ్వర్ గౌడ్, భారతీయ జనతా మహిళ మోర్చా డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిలకమార్రి కస్తూరి , అమలాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు, గణాల సాయి తదితరులు అధిక సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు