జనం న్యూస్ ఏప్రిల్ 14( ముమ్మిడివరం ప్రతినిధి)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముమ్మిడివరం మెయిన్ రోడ్ లో పోలమ్మ ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అంతకు ముందు అనాథవరం, బోండాయి కోడు సీతారాం పేట వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పితాని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా బాలకృష్ణ కొనియాడారు. నిమ్నజాతుల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతగానో తప్పించాలని ఆయన అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు ఎదుర్కొని విద్యాభ్యాసం చేసి తన జ్ఞానాన్ని భారతదేశ ఉన్నత కోసం వెచ్చించిన మహనీయుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ శ్లాగించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్, జడ్పీటీసీ కుడుపూడి శంకర్రావు, మున్సిపల్ కౌన్సిలర్లు బోసురాజు, రెడ్డి శ్రీమన్నారాయణ, సరిపెళ్ళ కృష్ణం రాజు, బడుగు శ్రీవాణి, దాసరి శ్రీను, వైసీపీ నాయకులు దొమ్మేటి అప్పారావు, మట్ట సత్తిబాబు, చింతా నాగ మునీంద్ర, పులిదిండి గేలవ్ నాధ్, నక్క సర్వేస్వరరావు, గుత్తుల మళ్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.