ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):-
అన్నమయ్య జిల్లా: శ్రీ లక్ష్మీ నరసింహా ట్రావెల్స్ (యస్ యల్ యన్ యస్ టీ) బస్సు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా అన్నమయ్య జిల్లా కురబలకోట వద్ద ప్రమాదం జరిగింది. రైల్వే ఫ్లై ఓవర్పై గురువారం వేకువజామున బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మార్కాపురం పరిసర ప్రాంతాలకు చెందిన 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మందిని మదనపల్లికు, మరో ఇద్దరిని తిరుపతి రుయాకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.