పేద వర్గాలకు అండగా నిలబడిన డా. బి అర్ అంబేద్కర్..
ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్వక్తి..
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..
ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.
జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్,// జమ్మికుంట )..
అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శమని,సమాజంలోని అసమానతలు, దురహంకారంపై అలుపెరుగని పోరాట యోధుడు, సమసమాజ స్వాప్నికుడు దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ బీ ఆర్ అంబేద్కర్, అని ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
భారత రాజ్యాంగ రూపకర్త, జాతీయవాది, న్యాయకొవిదులు, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా, సోమవారం కోర్టు చౌరస్థా కూడలి వద్ద నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలాడి రామారావు మాట్లాడుతూ…దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయ రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి భావి తరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఒకరికి, ఒకవర్గానికి చెందిన వారు కాదని ఈ సమాజంలోని ప్రజలందరి వాడని, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి, ప్రజల హక్కుల కాపాడిన మహోన్నత వ్యక్తి, అని తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ది, కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, అని అన్నారు. జాతీయ ఉద్యమంలో, అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటినుంచి సమాజంలోని అనేకుల, చే ఎన్నో అవమానాలు ఎదురైన వెను దిరగక వాటిని దైర్యంగా ఎదుర్కొని, తన కృషితో కేంద్ర మంత్రి పదవి అలంకరించారని రామారావు కొనియాడారు. అంబేద్కర్ జీవిత లో 32 డిగ్రీలు పొంది,డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడిగా నిలిచారన్నారు. విద్యాభ్యాసం తరువాత ఆర్థిక వేత్తగా ప్రొఫెసర్ గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోచించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసి పేద వర్గాలకు అండగా నిలబడిన, బీ ఆర్ అంబేద్కర్ తన జీవిత చివరన బుద్ధిని బోధనలు నచ్చి, బౌద్ధ మతం స్వీకరించి మహిళా హక్కులు, కార్మికుల హక్కులు, యితర అన్ని వర్గాల పేద ప్రజల కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా, ఈ సమాజం చూడాలని, ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆనాటి సామాజిక వర్గాల పరిస్థితుల నేపథ్యంలో అట్టడుగున ఉన్న దళిత గిరిజన వర్గాల అభ్యున్నతికి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని అంబేద్కర్ సూచనలతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం తో దళిత గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపయన్నారు. అంబేద్కర్ జయంతి రోజే. ఎస్సీ ఉపకులాలవారికి వర్గీకరణ చట్టం అమలుకు నేడే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వుల విడుదల చేయడం హర్షణీయమన్నారు.ఆర్ధికంగా వెనుకబడిన అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14 ప్రకారమే నేడు ఆర్ధికంగా వెనుకబడిన ఓసీల్లోని సామాజిక వర్గాల విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్,రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు . నేటి యువతరం, మనమందరం అబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, కుల, మత, రహిత సమాజకోసం అంకితమై, రెండు గ్లాసుల విధానానికి దూరంగా ఉండి అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గిరావించుకుందామని, దేశభక్తికి దేశభివృద్ధిలో పాలు పంచుకుందామని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. మానకొండూరు మండలంలోని తన స్వగ్రామమైన వన్నారం గ్రామ పంచాయతి కార్యాలయ ఆవరణలోగ్రామస్తులు, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న, అంబేద్కర్ విగ్రహ పనుల్లో పోలాడి రామారావు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన, అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నుంచి గ్రామ పంచాయతి కార్యాలయం వరకు అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో కొనసాగుద్దమని జై భీం అని అంబేద్కర్ ఆలోచనా విధానాలు వర్ధిల్లాలని కోరుతూ, కుల మత రహిత సమాజం కోసం పాటు పడుదామని నినాదాలు చేస్తూ భారీ ఊరేగింపు నిర్వహించారు. భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతి సెక్రటరీ ,నాయకులు , తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు యాదవ సంఘం నాయకులు, గ్రామ పంచాయతి ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ యువత సంఘటితంగా ఉత్సాహంగా పాల్గొన్నట్లు పోలాడి రామారావు తెలిపారు.