జనం న్యూస్,ఏప్రిల్14,జూలూరుపాడు:
జూలూరుపాడు మండల కేంద్రంలో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని వివిధ వర్గాల వారు వివిధ పార్టీలకు చెందిన వారు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, వెంగన్నపాలెం గ్రామానికి చెందిన యువకులు మహిళలు జూలూరుపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తు జై భీమ్ అని నినాదాలు చేస్తూ సంతోషన్ని వ్యక్తంచేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మహిళలు,యువకులు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం అంబేద్కర్ అభిమానులు మాట్లాడుతూ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన యువకులకు మహిళలు ధన్యవాదాలు తెలిపారు, ఎన్నో అసమానతలు, అవహేళనలు ఎదుర్కొంటున్నాము నేటి యువత కలిసికట్టుగా అంబేద్కర్ ఆశయాల దిశగా ముందడుగు వేస్తూ అంబేద్కర్ గొప్పతనాన్ని సాటిచెప్పాలని పిలుపునిచ్చారు, అంబేద్కర్ రాసించిన రాజ్యాంగన్ని మార్చాలని కుట్రపన్నుతున్నారాని అలాంటి వారుకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు,కులాలు,మతాలు, వర్గాల పేరిట చిచ్చుపెట్టి పబ్బగడపాల చూస్తున్నారు అలాంటి వారిని తన్ని తరిమికొట్టాలి తెలిపారు, అంబేద్కర్ ను,అంబేద్కర్ రాసించిన గ్రంధాన్ని(రాజ్యాంగం)అవహేళన చేస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు.