జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14.
మండలంలోని సూరేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కీర్తిశేషులు గ్రందే వెంకట రంగయ్య గ్రామ సర్పంచిగా 35 సంవత్సరాల పాటు ఎన్నో మంచి సేవలను అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడిన మంచి నాయకుడి గుర్తుగా విగ్రహాన్ని ఆయన కుమారులు రంగనాయకులు, శ్రీరంగం, మోహన్ లు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికిమార్కాపురం శాసనసభ్యులు కందుల. నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కీర్తిశేషులు గ్రందే. వెంకట రంగయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగాప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులుకందుల.నారాయణరెడ్డి మాట్లాడుతూ 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచిగా చేయడం ఉంటూ గ్రామ అభివృద్ధికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని అన్నారు. గ్రామ అభివృద్ధికి మంచి చేసిన వారిని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారని తెలియజేశారు. ముందుగా కీర్తిశేషులు గ్రందే. వెంకట రంగయ్య విగ్రహావిష్కరణకు హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డినీ వెంకటరంగయ్య కుమారులు దుశ్యాలవాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్, పొదిలి మండల టిడిపి నాయకులు కాటూరి పెద్దబాబు, మాజీ సమితి అధ్యక్షులు రావి. వెంకటరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కంచర్ల కాశయ్య, తర్లుపాడు మండల టిడిపి అధ్యక్షుడు ఉడుముల చిన్నపరెడ్డి, పుచ్చనూతల గోపినాథ్ చౌదరి, ఈర్ల. వెంకటయ్య, తిరుపతయ్య, నరసింహారావు, మహబూబ్ వలి, నంద్యాల కాశయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.