జనం న్యూస్ :14 ఎప్రిల్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :వై.రమేష్. ;
డా. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట రీజినల్ స్టడీ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరిగాయి. మొదటగా భారత రాజ్యాంగము సామాజిక న్యాయం అనే అంశంపై ముఖ్యఅతిథిగా/ వక్తగా హాజరైన డా. కే.హుస్సేన్ (మెదక్ ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్- సామజిక విశ్లేషకులు) మాట్లాడుతూ రాజ్యాంగము ద్వారా దేశంలోని అట్టడుగు వర్గాలకు సమాజంలోని మిగతా వర్గాల తో సమానంగా జీవించే అవకాశాలు కల్పించబడ్డాయి. ఒకప్పుడు ఈ దేశంలో మనుషులు మనుషులుగా చూడలేని అంటరాని వ్యవస్థ ఉండేది. రాజ్యాంగం ద్వారా అంటరానితనం భౌతికంగా దూరమైనప్పటికీ మనుషుల మెదల్లలో కులం అనే వివక్ష ఇప్పటికీ కొనసాగుతుందని అది రోజు రోజుకు మరింతగా బలపడుతుందని తెలిపారు. శాస్త్రీయంగా అలోచించి నపుడే వివక్ష తగ్గుతుంది అని తెలిపారు. గౌరవ అతిధిగా హాజరైన డా. గోపాల సుదర్శనం మాట్లాడుతూ…అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది అన్ని వర్గాలకు చదువును దగ్గర చేసిందని పేర్కొన్నారు. ఇటీవల భోదనా -పరిశోధన వంటి అంశాల పై ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. nరీజినల్ కొర్డినేటర్ డా. ఎం. శ్రద్దానందం మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక సూత్రాల పట్ల చర్చలు అవసరం అని, సమాకాలిన సామాజిక అంశాల పై లోతైనా చర్చలు మరింతగా జరుగా లని ఆకాంక్షిచారు. చివరగా ముఖ్య అతిధి డా. కె. హుస్సేన్ గారిని సన్మానించారు. రెండవది భారత రాజ్యాంగ పీఠికను మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనే అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో డా. సామ సువర్ణ దేవి, సీనియర్ కౌన్సిలర్ జి. బాలకిషన్, విష్ణు మూర్తి, రామాశ్రీ, పవన్, జి. శ్రీకాంత్, వై. రమేష్, రమణ, ధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.